logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తోటి కార్మికుడి కుటుంబానికి రూ.30 వేల సాయం – మెట్‌పల్లి పెయింటర్స్ యూనియన్ ఆదర్శం

మెట్‌పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 05/03/2026: జగిత్యాల జిల్లా,
మెట్‌పల్లి పట్టణానికి చెందిన బుర్ర శ్రీనివాస్ గౌడ్ పెయింటర్‌గా జీవనోపాధి పొందుతూ ఉండేవారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన మరణించగా, మెట్‌పల్లి డివిజన్ పెయింటర్స్, పీఓపీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. యూనియన్ సభ్యులు కలిసి రూ.30,000 నగదును ఆయన భార్య బుర్ర కవితకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పని చేసే ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు చేయించుకోవాలని సూచించారు. లేబర్ కార్డు ఉన్న కార్మికుడు సాధారణ మరణం సంభవిస్తే ప్రభుత్వం ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సాయం అందుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను ప్రతి భవన నిర్మాణ కార్మికుడు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఏశమేని గణేష్, కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు ఇంచార్జ్ బుర్ర మహేందర్ గౌడ్, సంఘం ఉపాధ్యక్షులు ఖాతా వినయ్, ఓడల రాకేష్, క్యాషియర్ మాతంగి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి బిజనపల్లి మనోహర్, రైటర్ చౌదరి శివకుమార్, పొన్నాల వినయ్, బజరంగ్ తడాస్, జనగాం సంపత్, బోయిని రామచందర్, జనగాం రమేష్, జనగాం నరసింహులు, షేక్ సోను, మారంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

6
577 views

Comment