*ఇచ్చోడ మండలం ముక్రా-కె గ్రామంలో 6 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 6 :-
*ఒక సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం.*
*ఇచ్చోడ ఎస్ హెచ్ ఓ బండారి రాజు*
జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు. ఇచ్చోడ మండలం ముక్రా-కె గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ ప్రతినిధుల సహకారంతో గ్రామంలోని ముఖ్య ప్రాంతాలలో 6 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు దొంగతనాలు మరియు ఇతర నేరాలను అరికట్టడానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఇచ్చోడ ఎస్హెచ్ఓ బండారి రాజు తెలిపారు.
నేరాల నివారణకు సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలు, కాలనీలు, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ నేరాలు జరిగినా నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.