వైకుంఠ ధామం వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం లొకేషన్ గుర్తింపు...
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 05/03/2026:
మెట్‌పల్లి మండలం మేడిపల్లి పడమర సబ్‌స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామం నుండి వైకుంఠ ధామం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడానికి అధికారులు లొకేషన్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) చెర్లకొండాపూర్ సర్పంచ్ లాస్య భర్త ఆనంద్‌తో కలిసి ప్రదేశాన్ని పరిశీలించి స్తంభాల ఏర్పాటుకు అవసరమైన మార్గాన్ని గుర్తించారు.
ఈ పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు అలాగే వైకుంఠ ధామానికి వెళ్లే వారికి విద్యుత్ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. స్థానికులు కూడా ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.