25 వేల బోగస్ ఉద్యోగుల కుంభకోణం బయటపడింది*
*వేల కోట్ల రూపాయల దోపిడి పర్వం!?*ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు,
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** మార్చి 04**(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
25 వేల బోగస్ ఉద్యోగుల కుంభకోణం బయటపడింది*
*వేల కోట్ల రూపాయల దోపిడి పర్వం!?
*ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని స్పష్టం*
రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులను ఉన్నట్లుగా చూపించి, నెలనెలా జీతాలు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
*ఆధార్ లింకేజీతో బయటపడిన మోసం*
ప్రభుత్వం చేపట్టిన ఆధార్ లింకేజీ ప్రక్రియలో ఈ భారీ అక్రమం బయటపడింది. ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేస్తున్నా, వాస్తవానికి ఆ వ్యక్తులు ఉద్యోగంలో లేరని గుర్తించారు. గత పదేళ్లుగా ఈ మోసం కొనసాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
*అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు*
బోగస్ ఉద్యోగుల పేర్లతో జీతాలు పొందిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఏ మాత్రం వదిలి పెట్టబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
*ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు*
ఈ మొత్తం వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు. అక్రమ చెల్లింపులు ఎలా జరిగాయి? ఎవరెవరు దీనిలో భాగస్వాములయ్యారు? ఎంత మేర నష్టం జరిగింది? అనే అంశాలను లోతుగా పరిశీలించనున్నారు.
*లోతైన విచారణకు సిద్ధం*
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణించి, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలనే సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపగా, ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ ఆడిట్ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.