logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మే 11 నుంచి జనాభా లెక్కల సేకరణ

*మే 11 నుంచి ఇళ్ల గణన: సీఎస్‌*
Akshay Akshay Jyoti
*జనాభా లెక్కల సేకరణ మొదటిదశ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు, కట్టడం వివరాల నమోదు కార్యక్రమాన్ని మే 11 నుంచి జూన్‌ 9 వరకూ పక్కాగా నిర్వహించాలని సీఎస్‌ కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఈ ప్రక్రియపై జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతీ హోళికెరితో కలసి మంగళవారం సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2027 జనాభా లెక్కల సేకరణ.. దేశంలో మొదటిసారిగా పూర్తి డిజిటల్‌ విధానంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఫీల్డ్‌ డేటా సేకరణ కోసం రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా మొత్తం వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. ప్రజల స్వచ్ఛంద నమోదు (స్వీయ-ఎన్యూమరేషన్‌) ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందు ప్రారంభమవుతుందని.. పౌరులు తమ డేటాను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.*

*🌀అన్ని గ్రామాలు, మండలాల సమగ్ర భౌగోళిక వివరాలను నిర్ధారించాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. ఏ ఇల్లు, నివాసం, మారుమూల నివాస ప్రాంతం, కుగ్రామం లేదా పట్టణ మురికివాడను కూడా మినహాయించకూడదని.. అన్ని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గణకులు, పర్యవేక్షకులు సహా అందరికీ శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు చేయాల్సిన విధులకు సంబంధించిన వివరాలు భారతి హోళికేరి తెలిపారు. డేటా సేకరణకు రూపొందించిన మొబైల్‌ యాప్‌లు, బ్యాకెండ్‌ పర్యవేక్షణ విధానాలు సహా అధునాతన డిజిటల్‌ వ్యవస్థల గురించి ఆమె వివరించారు.'
AAJ*

0
24 views

Comment