logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వినియోగదారుల హక్కుల రక్షణే లక్ష్యం

వినియోగదారుల హక్కుల రక్షణే లక్ష్యం:

తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం
నూతన అధ్యక్షురాలు దుబ్బ నీరజ.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బాధ్యతల స్వీకారం:

కల్తీ ఉత్పత్తులు, ముఖ్యంగా కల్తీ పాలపై యుద్ధం.
రాష్ట్రవ్యాప్త చైతన్య యాత్రలకు పిలుపు.

ప్రెస్ క్లబ్ నుండి హైదరాబాద్, మార్చి

వినియోగదారుడు మేల్కొంటేనే మోసగాడు మాయమవుతాడు, అనే నినాదంతో తెలంగాణలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నూతన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం నూతన అధ్యక్షురాలు దుబ్బ నీరజ ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వినియోగదారుల రక్షణ కోసం రూపొందించిన కార్యాచరణను వెల్లడించారు: కల్తీ ఉత్పత్తులపై ఉక్కుపాదం.
మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న కల్తీ ఆహార పదార్థాలు, తాగునీరు, మందుల పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కల్తీ పాల వల్ల ప్రజల ఆరోగ్యం, చిన్న పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోరాడతామని హెచ్చరించారు.

టెలికాం, ఆన్‌లైన్ మోసాలు:
టెలికాం రంగంలో అప్రకటిత ఛార్జీలు, నాణ్యత లేని డేటా సేవలతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేవలం నమ్మకమైన వేదికల ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు.

బిల్లు మీ రక్షణ కవచం:

ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు (బిల్లు) తీసుకోవాలని ఆమె కోరారు. బిల్లు లేకపోతే న్యాయపోరాటంలో వినియోగదారుడు బలహీనపడతాడని, ఐఎస్ఐ ముద్ర ఉన్న వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణ: రాష్ట్రవ్యాప్త పర్యటన: అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవడం.
హెల్ప్‌లైన్ ఏర్పాటు: ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థ, హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులోకి తీసుకురావడం.
గ్రామ స్థాయి కమిటీలు: ప్రతి గ్రామంలో వినియోగదారులను చైతన్యపరచడం. వినియోగదారుడే రాజు అని చెబుతాం కానీ, క్షేత్రస్థాయిలో అతడు మోసాలకు గురవుతూనే ఉన్నాడు. ప్రశ్నించే సమాజమే బలమైన సమాజం. హక్కులు తెలుసుకున్న వినియోగదారుడే నిజమైన రాజు" అని దుబ్బ నీరజ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కల్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయ
సహకారాలు అవసరం. దుబ్బ నీరజ.

రాష్ట్రంలో కాదేదీ కల్తికి అనర్హం అన్నట్టు ప్రతి వస్తువు కల్తిది రావడం వల్ల వినియోగదారులు ఎంతో నష్టపోతున్నారని ఆర్థికంగా వేలాదికోట్ల రూపాయలు ప్రతి వారానికి నష్టపోవడం జరుగుతుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరంకు సపోర్టుగా ప్రభుత్వంలో ఒక భాగంగా ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షురాలు దుబ్బ నీరజ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి వ్యాపారస్తుడి చేతిలో ప్రతి మనిషి నిత్యం మోసపోవడం జరుగుతుందని, సామాన్య ప్రజలు ఏ వస్తువు కొన్నా గాని మోసపోవడం జరుగుతుందని, ప్రధానంగా నిత్యం చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు తాగే పాలు కల్తీ పాలుగా వస్తున్నాయని అనేకసార్లు సంబంధిత శాఖ అధికారులు దాడులు చేసిన తరుణంలో నిర్ధారణ జరిగిందని, అయినా పాల కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏమిటి.? అని ఆమె ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతం నుండి హైదరాబాదు గడ్డ వరకు నిత్యం ప్రతి మనిషి వాడే వస్తువుల్లో కల్తీ కనపడుతుందని, దీనివల్ల సగటు మనుషులు ఎంతో నష్టపోతున్నారని, ఈ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తుందని ఆమె ఆరోపించారు. అక్రమ వ్యాపారాలు చేసేవారు అందరూ రాజకీయ నాయకుల చెంతన చేరి అక్రమ సంపాదనతో రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారని, ప్రజల మానప్రాణాలతో చెలగాటం ఆడుతూ తప్పులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, లేదా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకోవచ్చు అనే ముందుచూపు ఉద్దేశంతోనే రాజకీయ నాయకుల వెంట అక్రమ వ్యాపారస్తులు ఉంటున్నారని, ఇది ఆయా పార్టీలకు ఆరోగ్యకరమైనది కాదని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏది ఏమైనా గానీ కల్తీపై ఇకనుండి కన్జ్యూమర్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పెట్రోల్ బంకులు, ఎలక్ట్రికల్ షాపులు, రెస్టారెంట్లు దాబాలు, వైన్సులు, ఎలక్ట్రికల్ షాపులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, మెడికల్ షాపులు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు. హోటల్లు. అనేక వాణిజ్య వ్యాపార కేంద్రాలపై నిఘా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు. రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు.

0
0 views

Comment