logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం

Akshay Akshay Jyoti

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.(AAJ)*

- మహిళా దినోత్సవం సందర్భంగా డక్కిలి పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం, క్రీడలు, ర్యాలీ నిర్వహణ.



- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు డక్కిలి పోలీస్ స్టేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు అవగాహన, ఆరోగ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.



- ఈ సందర్భంగా డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), డక్కిలిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 70 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలకు రక్త పరీక్షలు, రక్తపోటు (BP), చక్కెర (Sugar) పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణపై వైద్యులు అవసరమైన సూచనలు అందజేశారు.



- అనంతరం డక్కిలి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళల కోసం మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ వంటి వినోదాత్మక క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యత మరియు ఉత్సాహం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.



- తదుపరి డక్కిలి పోలీస్ స్టేషన్ నుండి డక్కిలి సెంటర్ వరకు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.



- అనంతరం మహిళల భద్రత, సాధికారత మరియు లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి చైతన్య కార్యక్రమం చేపట్టారు.



- మహిళల భద్రత, మరియు సాధికారత కోసం తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు.

0
411 views

Comment