పిల్లల భవిష్యత్తు కోసం గళమెత్తుదాం!
Akshay Akshay Jyoti
విద్యార్థి తల్లిదండ్రులారా... మేల్కొందాం! మన పిల్లల భవిష్యత్తు కోసం గళమెత్తుదాం!
రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల దుస్థితిపై "ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)" బహిరంగ లేఖ.
-మన బ్రతుకులు బిచ్చగాళ్ల బ్రతుకు అయింది..
చదువుకుంటే బ్రతుకులు మారుతాయని ఆశపడ్డ తల్లిదండ్రులకు, చదువే ఇప్పుడు ఒక పెద్ద భారంగా, శాపంగా మారుతోంది. డిగ్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదివిస్తే మన పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుతారని కలలు కన్నాం.
-కానీ నేడు ఆ కలలు ప్రైవేట్ కళాశాలల గదుల్లో, మేనేజ్‌మెంట్ల లాకర్లలో బందీ అయి ఉన్నాయి.
నిలువు దోపిడీ - అడ్డగోలు నిబంధనలు:
సర్టిఫికెట్ల బందీ: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుందనే నమ్మకంతో మేము పిల్లలను చేర్పించాం.
కానీ నేడు అనేక కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను (10th, Inter) అక్రమంగా ఆపి ఉంచుకుంటున్నాయి.
-సర్టిఫికెట్లు లేక మన పిల్లలు ఉద్యోగాలకు వెళ్లలేక, పై చదువులకు దరఖాస్తు చేసుకోలేక, కూలీ పనులకు వెళ్తున్నారు. హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా మానసిక హింస చేస్తున్నారు.
-నిబంధనల ఉల్లంఘన: UGC, AICTE, NMC నిబంధనల ప్రకారం విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉంచుకోవడం నేరం. అయినా యాజమాన్యాలు ఏ చట్టాన్ని లెక్క చేయడం లేదు.
- APHERMC నిర్ణయించిన ఫీజు కంటే అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు.
-ఫీజుల మాయాజాలం: కొన్ని కళాశాలల్లో రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఖాతాల్లో పడినా, చట్ట విరుద్ధంగా మన వద్ద వసూలు చేసిన డబ్బులు తిరిగి విద్యార్థులకు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
- అప్పులు చేసి ఫీజులు కట్టిన తల్లిదండ్రులకు ఆ డబ్బులు అందక వీధుల పాలవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
-ప్రభుత్వ వైఖరి - ఉత్తుత్తి హెచ్చరికలు:
ప్రభుత్వం "చర్యలు తీసుకుంటాం" అని జీవోలు ఇస్తుంది తప్ప, ఏ ఒక్క కళాశాల మీద కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న ఫీజుల విషయంలో పట్టించుకోవడం లేదు.
-ఫిబ్రవరి 10-11, 2026న ప్రభుత్వం ₹1,200 కోట్లు (సుమారు ₹1,198 కోట్లు) ఫీజు రీయింబర్స్‌మెంట్ & స్కాలర్‌షిప్‌ల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు
– ఇది 2024-25 అకడమిక్ ఇయర్‌కు సంబంధించినది మరియు లక్షల మంది విద్యార్థులకు ఊరట ఇచ్చింది. PAAP దీనికి స్వాగతం పలికింది.
20 రోజులు గడుస్తున్నా(కాలేజీ ఖాతాలో లేదా తల్లుల ఖాతాలో) విడుదల చేయలేదు.. దాని ఊసే లేదు
-కానీమొత్తం పెండింగ్ మొత్తం ₹7,000 కోట్లకు పైగా ఉంది (Vidya Deevena & Vasathi Deevena స్కీమ్‌ల కింద). ఇంకా అనేక కళాశాలలు సర్టిఫికెట్లను ఆపి ఉంచుతున్నాయి, అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి.
-" 2004 సంవత్సరం నుండి గత రెండు దశాబ్దాలుగా కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు నిలిచిపోవడంతో, సామాన్య విద్యార్థులు కార్పొరేట్ సంస్థల దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ డిగ్రీ మరియు వృత్తి విద్యా కళాశాలలను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ అనుమతులపై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను అందించడంపై చూపి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి."
-ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ప్రైవేట్ సంస్థలు 'విద్యా వ్యాపారం' చేస్తూ, అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో దోచుకుంటున్నాయి. కనీస వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకున్నా అక్రమంగా పలు రకాలుగా ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు.
-తల్లిదండ్రులారా... భయం వీడండి!
మనం కట్టిన పన్నుల నుండే ప్రభుత్వం మన పిల్లలకు చదువు చెప్పించాలి. ఇది ఎవరి భిక్ష కాదు, మన హక్కు! మన మౌనం కళాశాల యాజమాన్యాలకు పెట్టుబడిగా మారుతోంది.
-మన పిల్లల బంగారు భవిష్యత్తు అంధకారం కాకముందే మనం ఒక్కటవ్వాలి.
-"ప్రశ్నించే హక్కు మనది - న్యాయ పోరాటం మన బాధ్యత"
-మన డిమాండ్లు:
మిగిలిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను (మొత్తం ₹7,000 కోట్లు+) వెంటనే విడుదల చేయాలి.
-చట్ట విరుద్ధంగా ఆపి ఉంచిన విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే అప్పగించాలి.
-నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
-విద్యార్థుల నుండి వసూలు చేసిన అదనపు ఫీజులను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి.
-న్యాయ పోరాటానికి సిద్ధం కండి! మీ సమస్యలను, ఫిర్యాదులను మా అసోసియేషన్ దృష్టికి తీసుకురండి.
- మనం కలిసి పోరాడితేనే మన పిల్లల సర్టిఫికెట్లు, భవిష్యత్తు మనకు దక్కుతాయి.
సంప్రదించండి:
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజి.నెం.6/2022)
📞 ఫోన్: +91 63053 13558
📧 ఈమెయిల్: parentsassociationap@gmail.com