గ్రామాల్లో ప్రజా భద్రతపై విస్తృత అవగాహన
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
- గ్రామాల్లో ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తిరుపతి జిల్లా పోలీసులు.
- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ తమ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల ద్వారా ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు.
- ప్రత్యేకంగా సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఓటీపీ మోసాలు, లింకులు, ఆన్‌లైన్ లోన్లు, సోషల్ మీడియా మోసాలు వంటి అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. ఏవైనా సైబర్ మోసాలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
- అలాగే విద్యార్థులు మంచిగా చదువుకొని, మంచి ప్రవర్తనతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, చెడు అలవాట్లు మరియు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సూచించారు. యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని, చట్టాలను గౌరవిస్తూ నడుచుకోవాలని అవగాహన కల్పించారు.
-