logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*శ్రీ లక్ష్మీనరసింహ వారి బ్రహ్మొత్సవములు-2026*


Akshay Akshay Jyoti
🙏 *ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము* 🙏

కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్

*శ్రీ లక్ష్మీనరసింహ వారి బ్రహ్మొత్సవములు-2026*

నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు 27.02.2026 నుండి 13.03.2026 వరకు 15 రోజుల పాటు అత్యంత వైభోపేతముగ జరుగును

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో

*6వ రోజు 04.03.2026 బ్రహ్మగరుడోత్సవము*

శ్రీ కదిరి కంభమురాయ గరుడ సేవ , దిక్కు దిక్కుల కెల్లా దివ్య నెత్రోత్సవం

నమః పన్నగ నద్దాయ వైకుంఠ వసవర్దినే ,శృతి చిందు సుద్ధోత్పద మందరాయ గారుత్మతే

సర్పాలను భూషణలుగాధరించి ,వేదలనే సముద్రం నుండి విద్యలనే అమృతాన్ని ఉత్పాతించే మందర పర్వతం వంటి సూపర్ణుడి రెక్కలు రెండు కర్మ,జ్ఞాన కాండలు, సర్ప భూషణుడైన గరుత్మంతుడు, శేషుడిని చేతి కంకణంగా ,యజ్ఞోపవీతం వాసుకి ,మొలనూడు తక్షకుడు ,కంఠ హారం కర్కోటకుడు ,కర్ణకుండలాలు పద్మం మహపద్మం,కిరీటం సంకపాలుడు ,బుజకీర్తులు గుళికలు వేల మాటాలెందుకు

వేదాత్మ విహగేశ్వర

సర్వ అంగాంగాలు వేదస్వరూపలుగా ,

బ్రహ్మ జరుపుతున్న బృహత్తర ఉత్సవాలలో నేడు బ్రహ్మ గరురుడై

శ్రీ ఖాద్రి నృసింహుడి కి వాహనంగా,దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా సప్త విద కైంకర్యాలు చేస్తూ అనేక విధాలుగా శ్రీ ఖాద్రీసుడిని సేవిస్తున్నాడు.

‘ఛందోమయేన గరుడేన సముహ్యమాన:’ అని శ్రీమద్ద్భాగవతము చెప్పినట్లు భగవంతుడు గరుడుని అధిష్టించే పయనం కొనసాగిస్తాడు.

పురాణాల ప్రకారం గరుత్మంతుడు(వేదాల ప్రతిరూపం) విష్ణు పురాణం

గరుత్మంతుడు నిత్యసూరి,గరుత్మoతునికి తెలియని స్వామి రహస్యాలు లేవు,అని తెలియజేస్తుంది గరుడపురణం

గరుడని ` పెరియతిరువడి `అనడం వైష్ణవ సంప్రదాయం. గరుడారూదుడైన ఈ స్వామిని,నారదాది భక్తపుంగవులు, వర్ణించిన తిరు మనోహరం.

వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది.

స్వామి బ్రహ్మొత్సవాలకు ముక్కొటి దేవతులకు ఆహ్వానం పలికే గరుడుడు.

ఉత్సవాలలో ధ్వజారోహణం నుండి 5వరోజు అనగా పంచవేదాలు, గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యం తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది.వాహనంగా, దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీ ఖాద్రీసుడిని సేవిస్తున్నాడు.

గరుడ వాహనం పై విహరించే ఉత్సవమూర్తికి ద్రువభేరమైన శ్రీ ప్రహ్లాద వరద నరసింహుడికి భేదంలేదని చెప్పడానికే, ఈరోజు నిత్యం మూలమూర్తి అభరణాలైనా అష్టోత్తర విష్ణు సాలగ్రామ మాల,యజ్ఞోపవీతం,సుదర్శన సాలగ్రామ మాల అలంకరిస్తారు.

ఈరోజు ఉత్సవ సందర్బంగా

ధ్వజస్తంభ అభిముకంగా గల గరుడ దీప స్తంభం వద్ద ,ప్రధాన ఆచార్యులు ఆలయ మర్యాదలతో వొచ్చి,లోక కల్యాణం కోసం, విశేష గరుడ దీపోత్సవం జరుపబడటటం పురాతన సంప్రదాయం,

అనంతరం స్వామి వారికి ఆస్థాన పూజ,రక్ష దారణం, అక్షతారోపనం,పూర్ణ కుంభ హారతి గావించి,అర్చకులు ఛత్ర చామరములు వంటి రాజోపచారములు చేయుచుండ

గరుడోత్సవంలో ,రాజగోపుర మహాద్వారం లో మోక్ష నరసింహుడై ప్రసన్న వదనుడిగా దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు,మోక్షం కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం.

సర్వకాల సర్వావస్థాలందు తనను శరణు కొరిన భక్తులను రక్షించేందుకు శంఖ చక్రధారై గరుడుని అదిరోహించి సిద్ధంగా ఉంటానని నా పాదాలను ఆశ్రయించండి చెప్పడమే గరుడసేవలోని పరమార్ధం

శ్రీవారిని విశేష మృదంగా వాద్యముల కీర్తనలతో,కోలాటాది భజనలతో, చతుర్ మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు.

ఓం నమో నరాయనాయ

ఓం నమో మోక్ష నరసింహ నమః

అని భక్తుల కీర్తనాలతో, స్మరణతో,

భక్తులు ఆరాధన చేసుకొని, ఖాద్రి క్షేత్రం పునీతమైనది

సర్వేజనాః సుఖినో భవంతు..



*Sreemath Khadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam*



KADIRI (TOWN,) SRI SATHYA SAI DISTRICT, A.P.



Web Site www.aptemples.ap.gov.in



*Sri Swamy Vari Bramosthavamulu-2026*



*From 27.02.2026 to 13.03.2026 (15 Days) Ustahvamulu*



6th Day on 04.03.2026 *Sri Swamy Vari Bramhagarudaseva*

0
134 views

Comment