కూటమితోనే అభివృద్ధి సాధ్యం: వడ్డీపలో 15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణంప్రారంభం
రోలుగుంట మండలం, వడ్డీప గ్రామంలో కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి మొదటి అడుగుపెట్టింది. నూతనంగా మంజూరైన 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను ఈ రోజు కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు.గ్రామాభివృద్ధికి ఈ నిధుల కేటాయింపు ఎంతో దోహదపడుతుందని ప్రజలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు, స్థానిక శాసనసభ్యుడు కేఎస్ఎన్ రాజుకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకముందు రోడ్లు బాగాలేదని, ఇప్పుడు మోక్షం కలిగిందని గ్రామవాసులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్కా నానాజీ, జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బుంగా కోటి, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముక్కుడుపల్లి జగదీష్ తో పాటు కాళ్ళలోవ, ముక్కుడుపల్లి వరహాలు, ముక్కుడుపల్లి లోవ తదితరులు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని నాయకులు స్పష్టం చేశారు.