logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు: యుద్ధానికి అమెరికా ఖర్చు ఎంత?

- ఇరాన్,ఇజ్రాయెల్ ఘర్షణ ప్రభావం… అమెరికా పై పెరుగుతున్న యుద్ధ వ్యయభారం.


Newyork మార్చ్ 04:

ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి, పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌కు మిత్రదేశంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా, ఆ దేశానికి మద్దతుగా నిలిచి ఇరాన్ లక్ష్యాల పై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు మృతిచెందినట్లు సమాచారం. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవిస్తుండగా, ప్రాంతీయ భద్రత పై ఆందోళనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాల మధ్య ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ముఖ్యంగా యూఏఈలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడుల కారణంగా అమెరికాకు చెందిన ఎయిర్ బేస్‌లకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నట్లు సమాచారం.

“ఇరాన్ వెనక్కి తగ్గింది,కానీ ఆలస్యమైంది”: ట్రంప్

ఈ పరిస్థితులపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది” అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

యుద్ధం కోసం అమెరికా ఖర్చు ఎంత?

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ చర్యల కారణంగా అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోంది. పలు నివేదికల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు "779 మిలియన్ డాలర్లు" ఖర్చు చేసింది. ఇది భారత కరెన్సీలో దాదాపు, "6,900 కోట్ల రూపాయలు" సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం, యూఎస్ఎస్ జనరల్ ఆర్ ఫోర్డ్ వంటి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లను నిర్వహించడానికి రోజుకు సుమారు "58 కోట్ల రూపాయలు" ఖర్చవుతోంది. యుద్ధానికి ముందస్తు సన్నాహాలు, సైనిక మోహరింపు, వ్యూహాత్మక ఏర్పాట్ల కోసం కూడా భారీ మొత్తంలో వ్యయం జరిగినట్లు తెలుస్తోంది.ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు మరియు స్థానిక యుద్ధ సామాగ్రి తరలింపుకు మాత్రమే అమెరికా సుమారు "630 మిలియన్ డాలర్లు" ఖర్చు చేసింది. ఇది భారత కరెన్సీలో సుమారు "5,556 కోట్ల రూపాయలు".

పెన్ వార్టాన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మెట్టర్స్ అంచనాల ప్రకారం, యుద్ధం ఇలాగే కొనసాగితే మొత్తం వ్యయం "210 బిలియన్ డాలర్లకు" చేరే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు "18.87 లక్షల కోట్ల రూపాయలు" అవుతుంది.

ఇజ్రాయెల్‌కు అమెరికా ఆర్థిక సహాయం: ఇదిలా ఉంటే, హమాస్‌తో జరిగిన యుద్ధం కారణంగా నష్టపోయిన ఇజ్రాయెల్‌ కు అమెరికా భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తోంది. 2023 సంవత్సరంలో మాత్రమే అమెరికా ఇజ్రాయెల్‌కు "21.7 బిలియన్ డాలర్లు" ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం.ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులు ఎలా మారతాయన్నది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

179
5024 views

Comment