బీటెక్ విద్యార్థినిపై వేధింపులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
జర్నలిస్టు : మాకోటి మహేష్
నిజాంపేటకు చెందిన 20 ఏళ్ల యువతి బాచుపల్లిలోని వి.ఎన్.ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఆశిష్ తనయ్ (20) అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
యువతి ఫిర్యాదు ప్రకారం, 2023 అక్టోబరులో కళాశాల గదిలో బెదిరింపులతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి దాడులు చేశాడని తెలిపింది. చాక్లెట్లలో మత్తు పదార్థం కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి చిత్రీకరించాడని ఆరోపించింది.
గతేడాది ఫిబ్రవరి 14న తన మిత్రుడు ప్రవీణ్‌ను పరిచయం చేసి, గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లి మరోసారి దాడి చేయడానికి యత్నించగా తప్పించుకున్నట్లు తెలిపింది. వీడియోలు బయటపెడతానని బెదిరింపులు కొనసాగడంతో వేధింపులు భరించలేక యువతి తల్లికి విషయం చెప్పింది.
ఫిబ్రవరి 28న తల్లి ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
⚠️ ముఖ్య గమనిక:
ఇలాంటి వేధింపులు, బ్లాక్‌మెయిల్, సైబర్ దుర్వినియోగం ఎదురైతే వెంటనే పోలీసులను లేదా 181 మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. మౌనం సమస్యకు పరిష్కారం కాదు.
#HyderabadNews
#WomenSafety
#CyberCrime
#PoliceInvestigation
#StopHarassment