కుసర్లపూడిలో శ్రీదేవి పెద్దింటమ్మ తల్లి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఐదు రోజులు సాంస్కృతికోత్సవాలు,
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం.కుసర్లపూడి గ్రామంలో నిర్వహించిన పెద్దింటి అమ్మ తల్లి మహోత్సవాలు అత్యంత ఘనంగా, వైభవంగా ఐదు రోజుల పాటు జరిగాయి. గత నెల 27వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగ్గు సాయి. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఈ మహోత్సవాలను విజయవంతం చేశారు. ప్రతిరోజూ విశేష పూజలతో పాటు భారీ అన్నసమర్పణ ఏర్పాటు చేసి, భక్తులకు అమ్మవారి ప్రసాదం అందించారు. డాన్స్, బేబీ డాన్స్ హంగామాలు, "దొందూ దొందే కంటే కూతుర్నే కనాలి" నాటకం గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. మంగళవారం వేద పండితుల హోమం, సాయంత్రం గుర్రపు పందెల పోటీలు ఉత్సాహాన్ని పెంచాయి. భారీ స్థాయిలో బహుమతులు పంపిణీ చేసి, పాల్గొన్నవారిని సంతోషపరిచారు. ఊరేగింపులో శక్తి వేషాలు, కేరళ డ్రమ్స్, దాండియా డాన్స్, భారీ మందు గుండు సామగ్రి ప్రదర్శన అద్భుతంగా ఆకర్షించాయి. ఐదు రోజుల పాటు గ్రామమంతా విద్యుత్ లైటింగ్‌తో అలంకరించి, పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, తరతరాలుగా గ్రామ ఇలవేల్పు శ్రీశ్రీ దేవి పెద్దింటమ్మ తల్లి మహోత్సవాలను పార్టీలకు అతీతంగా ఐక్యంగా జరుపుతున్నామని, పండుగ వైభవానికి కారణమైన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు, గ్రామ టీడీపీ అధ్యక్షులు సబ్బవరపు పెద్ది నాయుడు, సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ కొల్లు సన్యాసినాయుడు, మాజీ ఎంపీటీసీ గొల్లు రమణ, కేతిరెడ్డి సుధాకర్, గొల్లు గోవింద్, సబ్బవరపు ముసిలి నాయుడు, సబ్బవరపు కాశి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.