పాలు, నెయ్యే కాదు.. దోమల రీఫిల్స్, సర్ఫ్, టీ ప్యాకెట్లు కల్తీవే!*
*వస్తువులు కొనేటప్పుడు ప్యాకెట్లపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కొనుగోలు చేయండి
తెలంగాణ స్టేట్** హైదరాబాద్** మార్చి 04**( ఏఐఎంయూ మీడియా ప్రతినిధి)
*పాలు, నెయ్యే కాదు.. దోమల రీఫిల్స్, సర్ఫ్, టీ ప్యాకెట్లు కల్తీవే!*
లాభాల కోసం కల్తీ రాయుళ్లు బరి తెగించారు. గుజరాత్ నుంచి నాణ్యత లేని మెటీరియల్ను HYDకు తెచ్చి వాటిపై బ్రాండ్ల పేరుతో ఫేక్ కవర్లను అంటించి అమ్ముతున్నారు. తాజాగా 1,340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ ప్యాకెట్లు, 1,900కు పైగా సర్ఫ్ పౌడర్ ప్యాకెట్లు, 3,600 ఫేక్ గుడ్ నైట్ రీఫిల్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఏదైనా వస్తువు కొనేముందు దానిపై QR కోడ్ స్కాన్ చేసి తీసుకోవాలని సూచించారు••