అక్రమ నిర్మాణాలు ఆపాలని కవిత ఆందోళన
తెలంగాణ స్టేట్** హైదరాబాద్** మార్చి 03***( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
అక్రమ నిర్మాణాలు ఆపాలని కవిత ఆందోళన (వీడియో)
తెలంగాణ : హైదరాబాద్ నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన చేపట్టారు. రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.