logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కడప నగర డిసిసి సయ్యద్ గౌస్ పీర్.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కడప నగర డిసిసి సయ్యద్ గౌస్ పీర్.

రాహుల్ గాంధీతో సహా పలువురు గొప్ప నాయకులతో ఈ ట్రైనింగ్ సాగింది.

హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో నూతనంగా ఎంపికైన డీసీసీలకు ట్రైనింగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుండి వెళ్లిన ఏకైక నాయకుడు మన సయ్యద్ గౌస్ పీర్. తన అనుభవాలను వివరిస్తూ వికారాబాద్ లో పది రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసి నిర్వహించవలసిన కర్తవ్యాలు ఏంటో, అలాగే డీసీసీలకు ఉన్న పరిధి ఏమిటో ట్రైనింగ్ లో వివరించడం జరిగింది. జి జి జో ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు క్లాసులు మరియు శ్రమదానం వంటి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వివరించడం జరిగింది, కాంగ్రెస్ విధి విధానాలు వివరంగా తెలియజేయడం జరిగింది. చాలామంది కాంగ్రెస్ అధినాయకులు అక్కడికి రావడం వారి అనుభవాలను పంచడం లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొదటి రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ షర్మిలారెడ్డి వచ్చి ఎంతో ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ పది రోజుల కార్యక్రమంలో చివరి రెండు రోజులలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు విచ్చేసి క్లాసులు తీసుకోవడం జరిగింది, కాంగ్రెస్ బలోపేతంలో భాగంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు డిసిసిలను అత్యుత్తమ కేడర్గా తీసుకొని వాటి విధి విధానాలు వివరించడం జరిగింది అంతేకాక అందర్నీ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, అక్కడికి వచ్చిన అందరి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వారితో ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఆధ్యాంతం ఆహ్లాదకరంగా జరిగిన ఈ ప్రోగ్రాం భవిష్యత్తులో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన ఉత్సాహంతో కడప జిల్లాలో కాంగ్రెస్ పురోగతికి తన వంతు కృషి చేస్తానని, రాబోయే ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

1
386 views

Comment