logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలుగు భాష నన్ను IPS చేసింది'.. మాతృభాషోద్యమ రూపశిల్పి కిల్లాడ సత్యనారాయణ

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం: మాకవరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలను వివరించే కార్యక్రమం నిర్వహించారు. యూపీ రాష్ట్ర మాజీ అడిషనల్ డీజీపీ, ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ, ఆల్ ఇండియా ఓబీసీ జ్యోతిరావు పూలే అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు కలిసి విద్యార్థులకు ప్రత్యేక క్రీడా కిట్‌లను పంచి ప్రోత్సహించారు.కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన కిల్లాడ సత్యనారాయణ నర్సీపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "తెలుగు భాష నన్ను IPS చేసింది" అని ప్రధానం గా చెప్పుకున్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నాలుగుసార్లు రాసినా మెయిన్స్‌లో విఫలమయ్యారు. ఐదోసారి తెలుగులో రాసి ఐపీఎస్‌కు ఎంపికైనట్టు వెల్లడి చేశారు. ప్రతిభావంతులైన ప్రతి విద్యార్థికి తాను ఎల్లప్పుడూ చేయూత నిస్తానని, ఉత్తరాంధ్రలో తక్కువ ఖర్చుతో నీట్, ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి కోర్సులు చదువుకునే సదుపాయాలు కల్పించడానికి తన శక్తికి మించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రతిభావంతులకు పూర్తిగా ఉచిత సహాయం అందిస్తానని తెలిపారు.తెలుగు మాధ్యమంలో ఇంగ్లీష్ పదాలు (తెంగ్లీషు) కలపకుండా పిల్లలకు పూర్తి తెలుగులో విద్య అందించాలని వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల కోచింగ్ సదుపాయాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నినాదం "మాతృ భాషే ముద్దు, అమ్మ భాషే మాతృ భాష. మన ఊరు, మన భాష, మన చదువు" అని ఉంది. ఆల్ ఇండియా ఓబీసీ జ్యోతిరావు పూలే అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు, ఎక్స్ ఐటీ ప్రొఫెషనల్ సంబంగి రమేష్ నాయుడు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.సత్యనారాయణను 'మాతృభాషోద్యమ రూప శిల్పి'గా అభివర్ణించారు. ఢిల్లీలో వాజోరం, ఫిజిక్స్ వాలా, నెక్స్ట్ ఐఏఎస్ వంటి ప్రముఖ కోచింగ్ సెంటర్లతో కలిసి మెరిట్ విద్యార్థులను గుర్తించి విద్యా ప్రోత్సాహానికి సహాయం చేస్తామని, నర్సీపట్నం చుట్టుపక్కల పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

0
267 views

Comment