logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

19వ డివిజన్ ప్రజల గుండెల్లో నిలిచిపోనున్న డాక్టర్ స్వప్న 19వ డివిజన్ గర్భిణీలకు ఉచిత డెలివరీ ప్రకటించిన కార్పొరేటర్ డాక్టర్ స్వప్న



కొత్తగూడెం మార్చి 2 ( ):కొత్తగూడెంలో ప్రముఖ డాక్టర్లుగా డాక్టర్ స్వప్న డాక్టర్ శంకర్ నాయకులు ప్రజలందరికీ సుపరిచితులే సేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 19వ డివిజన్ నుండి మొట్టమొదటి కార్పోరేటర్ గా ఘనవిజయం సాధించి డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ తనదైన శైలిలో దూసుకు వెళ్తున్న కార్పొరేటర్ స్వప్న మరో అడుగు ముందుకు వేసి 19వ డివిజన్ గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ ప్రకటించి తండా డివిజన్ వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేతావత్ స్వప్న. కొత్తగూడెం విద్యానగర్ మెయిన్ రోడ్డు లో న్యూ లైఫ్ హాస్పిటల్ నందు 19 డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతవత్ స్వప్న భూక్య వెన్నెల అనే చిట్టి రామవరం తండ గ్రామస్తురాలకి ఉచితంగా డెలివరీ చేసినారు. ఈ సందర్భంగా 19వ డివిజన్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీ చేయబడుతుందని ఉచితంగా చేసే సేవలను 19వ డివిజన్లో ఉన్న గర్భిణీ స్త్రీలు అందరూ ఉపయోగించుకోవాలని 19వ డివిజన్ కార్పొరేటర్ కేతావత్ స్వప్న శంకర్ నాయక్ ఈ సందర్భంగా తెలియజేసినారు.

2
847 views

Comment