తెలుగు మీడియంలో ఇంగ్లీషు పదాలతో క్లాసులు నడపకుండా మాతృభాషోద్యమం
తెలుగు మాతృభాషను బలోపేతం చేయాలనే ఉద్యమంలో ఐపిఎస్ అధికారి సత్యనారాయణ ముందుండి నడుస్తున్నారు. తెలుగు మీడియంలో ఇంగ్లీషు పదాలతో (తెంగ్లీషు) క్లాసులు, సబ్జెక్టులు నడపకుండా పిల్లలకు పూర్తి తెలుగులో విద్యను అందించాలని వాదిస్తున్నారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కోచింగ్ సదుపాయాలు కల్పించాలని పిలుపునిచ్చారు."మాతృ భాషే ముద్దు, అమ్మ భాషే మాతృ భాష. మన ఊరు, మన భాష, మన చదువు" అని ప్రారంభించిన ఈ పిలుపులో గ్రామీణ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నడుం బిగించాలని సత్యనారాయణ (ఐపిఎస్, యూపీ క్యాడర్) పిలుపునిచ్చారు. "మన పిల్లల భవిష్యత్తును వెలిగిద్దాం, మన తెలుగును బ్రతికిద్దాం. కదలి రండి... ఈ మాతృభాషోద్యమంలో భాగస్వాములవ్వండి" అని ప్రోత్సహించారు.ఈ ఉద్యమానికి మద్దతుగా పోతల ప్రసాద్ నాయుడు (ఆల్ ఇండియా ఓబీసీ జ్యోతిబా పూలే అధ్యక్షుడు, సోషల్ & పాలిటికల్ యాక్టివిస్ట్, రాజేంద్రనగర్, న్యూ ఢిల్లీ) మరియు సంబంగి రమేష్ నాయుడు (ఎక్స్ ఐటీ ప్రొఫెషనల్, ఇన్ఫోటెక్-హైదరాబాద్, RMSI-దిల్లీ, సోషల్ & పాలిటికల్ యాక్టివిస్ట్, బొబ్బిలి, విశాఖ వికినిటీ, సంతకాలు చేశారు. సత్యనారాయణను 'మాతృభాషోద్యమ రూప శిల్పి'గా అభివర్ణించారు.ఈ ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు విద్యా వ్యవస్థను బలపరచడంలో మైలురాయిగా మారనుందని ఈ సందర్భంగా తెలిపారు.