logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీశ్రీశ్రీ దేవి పెద్దింటమ్మ తల్లి మహోత్సవాలు విజయవంతంగా

చోడవరం శాసన సభ్యులు కె.యస్.యన్.యస్. రాజు ఆధ్వర్యంలో 27‑02‑2026 నుండి 03‑03‑2026 వరకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కుసర్లపూడి గ్రామంలో కుసర్లపూడి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ దేవి పెద్దింటమ్మ తల్లి ఉత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఉత్సవాలకు గ్రామ సర్పంచ్ మడ్లు అప్పలనాయుడు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌లు కిల్లాడ అప్పలసీతయ్య నాయుడు, గొల్లు రాంబాబు, గ్రామ టి.డి.పి. నాయకులు సబ్బవరపు పెట్టినాయుడు, గొల్లు రమణ, మండల వైస్ ఎం.పి.పి. కొల్లి సన్యాసినాయుడు, , గ్రామ పెద్దలు ప్రత్యేక ఆతిథ్యం అందించారు.ప్రతిరోజు ప్రధాన కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగుతాయి.27‑02‑2026: మధ్యాహ్నం 12:00 గంటలకు సర్పంచ్ మడ్లు అప్పలనాయుడు ఆధ్వర్యంలో అన్న సమారాధన; రాత్రి 9:00 గంటలకు విశాఖపట్నం వారిచే “డ్యాన్స్ బేబీ డ్యాన్స్” హంగామా (విల్లూరి పట్టాభి ఆర్థిక సహాయంతో).28‑02‑2026: మధ్యాహ్నం 12:00 గంటలకు కీశే సబ్బవరపు యల్లయ్య మనుమరాళ్ళు, మనవళ్ళు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన; రాత్రి 9:00 గంటలకు గుంటూరు వారిచే “దొందు–దొందే” నాటిక (దాతలు: పుత్రులు, సబ్బవరపు లక్ష్మీనారాయణ).01‑03‑2026: మధ్యాహ్నం 12:00 గంటలకు కీశే కిల్లాడ జోగినాయుడు మనవడు రామకృష్ణ, పచ్చిగోళ్ళ భావనరాయణ (తాతాజీ) ఆర్థిక సహాయంతో అన్న సమారాధన.02‑03‑2026: మధ్యాహ్నం 12:00 గంటలకు కొరుప్రోలు రాజుబాబు కుమారులు, కేతిరెడ్డి రామునాయుడు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన; రాత్రి 9:00 గంటలకు అనకాపల్లి వారిచే “కంటే కూతుర్నే కనాలి” నాటిక (రచన & దర్శకత్వం దాడి జగన్నాధరావు; దాతలు: కీశే గొల్లు గంగునాయుడు కుటుంబ సభ్యులు).ప్రత్యేక కార్యక్రమాలు – 03‑03‑2026ఉదయం 9:00 గంటలకు వేద పండితులచే ఆలయంలో హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 3:00 నుండి 5:00 గంటల వరకు గుర్రం పందాలు జరిగాయి (ప్రథమ బహుమతి రూ. 20,000, ద్వితీయ రూ. 15,000, తృతీయ రూ. 10,000). సాయంత్రం 7:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో జెండా ఎదురు కట్టడంతో అనంతరం జాతర ఊరేగింపు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపులో శక్తి వేషాలు, కేరళ డ్రమ్స్, దాండియా డ్యాన్స్తో పాటు అన్నవరం వారిచే భారీ మందుగుండు సామాగ్రి ప్రదర్శిస్తారు (దాతలు: కీశే కిల్లాడ జోగినాయుడు కుటుంబ సభ్యులు). ఈ రోజు బాణాసంచా తక్కువను కూడా అదే కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నారు.అమ్మవారి ఆలయ పరిశుభ్రత, డెకరేషన్లు, సన్నాయి మేళం27‑02‑2026: అమ్మవారి ఆలయానికి పచ్చిపూల డెకరేషన్‌కు విజదుర్గ జ్యూయలరి పెదపాటి సర్వేశ్వరరావు & రమేష్, గాలి రాజుబాబు, కశిరెడ్డి రమణ, పోలుపర్తి శ్రీను, చిటికెల ప్రసాద్, కేతిరెడ్డి లోవనాయుడు, సబ్బవరపు రమేష్ దాతలుగా వ్యవహరించారు.03‑03‑2026: అమ్మవారి ఆలయ పచ్చిపూల డెకరేషన్‌కు గేదల మహాలక్ష్మి నాయుడు, గేదల వెంకటేష్ (డాక్టర్), కీశే సబ్బవరపు పెట్టినాయుడు కుమారులు శివన్నారాయణ, కాశి దాతలుగా వ్యవహరిస్తున్నారు.27‑02‑2026 నుండి 03‑03‑2026: ఉత్సవ కాలంలో అమ్మవారి ఆలయంలో నర్సీపట్నంకు చెందిన సన్నాయి మేళం అందరికీ ఆకట్టుకుంది.రాజా మైక్, లైటింగ్, భారీ విద్యుత్ సమాయత్తంఉత్సవ కాలంలో జంగాలపల్లి బాబులు ఆధ్వర్యంలో రాజా మైక్ & లైటింగ్, భారీ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం, రామాలయం వెనుక, వై.యస్.ఆర్. సెంటర్, హైస్కూల్ గ్రౌండ్‌లో ప్రత్యేక విద్యుత్ సౌకర్యాలతో ప్రతి కార్యక్రమం వెలుగులో సాగనుంది.

1
775 views

Comment