logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నర్సీపట్నంలో శారద హాస్పటల్‌, వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ప్రముఖ శారద హాస్పటల్ మరియు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్జన్ డాక్టర్ డి. అజయ్ స్రవంత్ పర్యవేక్షణలో బీపీ, సుగర్, బీఎంఐ పరీక్షలు చేపట్టారు.ఈ శిబిరంలో 80 మంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, మందులు అందించారు. పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి నెలా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ అజయ్ స్రవంత్ తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందేలా చేస్తోందని అన్నారు.వాకర్స్ క్లబ్ విశ్రాంత ఉపాధ్యాయుడు డి. నూకరాజు, ఉపాధ్యాయులు ఐ. శ్రీనివాస్, ఎం.ఎస్. ప్రసాద్, ఆళ్ల వరప్రసాద్, వాకర్స్ క్లబ్ పిట్ల శ్రీను తదితరులు, ఆస్పత్రి సిబ్బంది స్వయం స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానికులు ఈ ఉద్యమానికి ఆకర్షితులై, మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.

10
412 views

Comment