చల్మెడ రిషిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం డే సెలబ్రేషన్.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా నిజాంపేట్ చల్మెడ గ్రామంలోని రిషిక్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.స్వామి, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ అంతర్లీనంగా ఉంటుందని పేర్కొన్నారు సైన్స్ లేనిదే ప్రపంచంలో ఏ పని జరగదని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు సైన్స్ అంశాలపై ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలు సంధ్య మరియు ఉపాధ్యాయురాలు స్వప్న, భాగ్యలక్ష్మి ,స్వప్న , లావణ్య , సంధ్య , తదితరులు పాల్గొన్నారు