ఈ రోజు జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డీఎస్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి లోపింటి చిట్టిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అరసవల్లి రోడ్డులోని ఆదిత్య ఆర్చరీ అకాడమీ, కొయ్యన కన్నయ్యనగర్ వేదికగా ఎంపిక పోటీలు ఉదయం 10.30 గంటల నుంచి మొదలవుతాయని చెప్పారు. మినీ అండర్ -10, అండర్-13, అండర్ -15, ఇండియన్ రౌండ్, రికర్వే, కాంపౌండ్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కృష్ణ జిల్లా నూజివీడులో ఈనెల 11వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలను ఇక్కడ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 94406 77201, 99899 78727 నంబర్లను సంప్రదించాలని సూచించారు.