logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహణ, *డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్*



తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఐటీడీఏ** 28 ఫిబ్రవరి **
(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహణ,

*డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్*

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం నందు జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ అన్నారు. శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత అయిన సి.వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సి.వి రామన్ కాంతి పైన చేసిన పరిశోధనకు గాను 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చిందని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులందరూ సి.వి రామన్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు రంగోలి , వకృత్వ పోటీ, వ్యాసరచన పోటీ మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సైన్స్ విభాగ వివిధ అధిపతులు ,కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

32
887 views

Comment