logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భక్తి భావానికి ప్రతీకగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లైటింగ్, **అలంకరణకై నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత,




తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** కరకగూడెం మండలం** ఫిబ్రవరి 28 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

భక్తి భావానికి ప్రతీకగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు,

శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహ మహోత్సవం సందర్భంగా గుడి అలంకరణకై నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత.
ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆలయ పరిసరాలు శుభ్రం చేయించి గుడి అలంకరణకై నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ,పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,ఉప సర్పంచ్ బుడగం రాము..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
స్వామి వారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని,వివాహ మహోత్సవ వేడుకలు శాంతి ఐక్యతతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో
ఆలయ అర్చకులు, పెద్దలు,మండల నాయకులు గొగ్గలి రవి, ముంజాల సాయిబాబా, సోలం బాబు, కొమరం భూషణం,వార్డు మెంబర్ వేణు, బిలపాటి సంపత్,భక్తులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

41
832 views

Comment