logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్రామo లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం *నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,

తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ***కరకగూడెం మండలం*** ఫిబ్రవరి 28**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
********************************


గ్రామo లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

*నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,

*ఎమ్మెల్యే ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు ,


కరకగూడెం, ఫిబ్రవరి 28:( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)మండలంలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రామాల్లో తరచుగా ఎదురవుతున్న లో వోల్టేజ్ సమస్యలు మరియు విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు ఎంతో ఉపయోగపడనున్నాయని తెలిపారు.

వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోల్కమ్మతోగు గ్రామంలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా వ్యవసాయం, గృహ వినియోగం మరియు చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ నరహరి రాజశేఖర్, ఎమ్మార్వో కాంతయ్య, ఎంపీడీవో కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,
అదేవిధంగా సర్పంచ్‌లు బట్టుపల్లి తోలెం రమాదేవి, కరకగూడెం పోలేబోయిన సుజాత, చిరుమల్ల కొమరం సుగుణ, వెంకటాపురం చౌలం కేశవరావు, పద్మాపురం - తోలెం రమేష్,చొప్పాల తోలెం సావిత్రి, గొల్లగుడెం ఎల్లబోయిన ముత్తమ్మ , కొత్తగూడెం ఎర్రం పొట్టయ్య,, ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు, పోలేబోయిన శ్రీవాణి , తిరుపతయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అభిమానులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

20
179 views

Comment