logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*42 సం"లు విధి నిర్వహణ చేసి పదవీ విరమణ పొందిన అధికారికి ఘన సత్కారం.*

*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
ఫిబ్రవరి 28 :-



*పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై "అన్వర్ ఉల్ హక్"*

*పోలీస్ వ్యవస్థలో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం*

*స్పెషల్ బ్రాంచ్ శాఖలో 25 సం"ల పాటు విధులు.*

*ఉన్నత స్థాయి అధికారులచే ప్రశంసలు, రివార్డులు, అవార్డులు*

*పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులచే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉండాలని సూచన.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*

ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు సుదీర్ఘకాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్ కు కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలను కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ శేష జీవితాన్ని జీవించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
*ఎస్సై అన్వర్ ఉల్ హక్*

1985 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థలోకి అడుగుపెట్టి 1991లో హెడ్ కానిస్టేబుల్ గా 2000 సంవత్సరంలో ఏఎస్ఐగా 2012 సంవత్సరంలో ఎస్సైగా పదోన్నతి పొంది తన పోలీసు వ్యవస్థలు 42 సంవత్సరాల పాటు సేవలందించి ఈరోజు పదవి విరమణ పొందడం జరిగింది. సర్వీసులో హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ మరియు ఎస్ఐ స్థాయిల నందు 25 సంవత్సరముల పాటు స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వర్తించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భాలలో బందోబస్తు ఏర్పాటులో, పండగలు మరియు ఎన్నికలు, ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడిన శాంతిభద్రతల సమస్యల ఉన్నప్పుడు చురుకుగా వ్యవహరించి బందోబస్తును ఏర్పాటు చేయడంలో కృషి చేయడం జరిగింది. జిల్లా పోలీసు వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న స్పెషల్ బ్రాంచ్ లో ఎక్కువ కాలం విధులు నిర్వర్తించడం జరిగింది. తన సర్వీసులో ఉత్తమ సేవలందించినందుకు గాను ప్రభుత్వం సేవా పథకం, ఉత్తమ సేవా పథకము, ఉత్కృష్ట సేవా పథకాన్ని అందించి గౌరవించింది. 42 సంవత్సరముల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థలో సేవలందించడం జరిగింది. మొదటి పది సంవత్సరముల పాటు సంఘవిద్రోహశక్తులతో పోరాడడంలో స్పెషల్ పార్టీ నందు విధులు నిర్వహించడం జరిగింది.

పదవి విరమణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మోహన్, సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

6
355 views

Comment