logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా, ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన

విజయనగరం జిల్లా.రాజాం.
అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా, ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 256609రూపొందించిన వినూత్న సైన్స్ నమూనాలు, ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ప్రవీణ్ కుమార్ హాజరై ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.
స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేశారు

41
1809 views

Comment