logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్ ఆర్ కేటి పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు


కొత్తగూడెం ఫిబ్రవరి 28 ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేదరబస్తీలో ఎస్ ఆర్ కె టి పాఠశాలలో రెండురోజుల పాటు అత్యంత వైభవంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో సి. వి. రామన్ ప్రభావం అనే ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు కనుక ఈ రోజున వేడుకలు జరుపుకుంటున్నాము..ఎస్ ఆర్ కె టి పాఠశాలలో మొదటిరోజు విద్యార్థులకు గ్రూపుల వారీగా విద్యార్థులను విభజించి క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలు ఎస్ ఆర్ కె టి పాఠశాల డైరెక్టర్స్ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆధ్వర్యంలో జరిగాయి.రెండో రోజు అంటే ఫిబ్రవరి 28న పాఠశాల డైరెక్టర్ రామరాజు, హథీరాం జానకిరామ్ పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణ వైస్ ప్రిన్సిపల్ సాల్మన్ పాఠశాల సిబ్బంది సి.వి రామన్ చిత్రపటానికి పూలమాలతో అంజలి ఘటించడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తెచ్చిన వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించడం జరిగినది. విద్యార్థులు తెచ్చిన వర్కింగ్ మోడల్స్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీక్షించి అభినందించడం జరిగినది.ఈ వర్కింగ్ మోడల్స్ లో బయాలజీ విభాగంలో మట్టితో పని లేకుండా కేవలం నీటితో పౌష్టిక ఆహారంతో ప్లాంట్స్ పెరుగుట అలాగే భౌతిక శాస్త్ర విభాగంలో చంద్రయాన్-3. రసాయన శాస్త్ర విభాగంలో మురికి నీటిని ఎలా శుద్ధి చేయాలి అనే ప్రక్రియను విద్యార్థులు చక్కగా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించడం జరిగినది.

13
927 views

Comment