జాతీయ వేదికపై శాంతిరాం ఇంజినీరింగ్ విద్యార్థుల విజయ కిరీటం.
పాణ్యం (AIMA MEDIA): శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఎఐఎంఎల్ విభాగం మూడవ సంవత్సరం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి మరోసారి తమ సత్తాను చాటుకున్నారు. హ్యాకథాన్ పోటీలలో సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలతో విశిష్ట ప్రదర్శన ఇచ్చి విజేతలుగా నిలిచి కళాశాలకి కీర్తి తీసుకువచ్చారు. విజేతలుగా నిలిచిన వారు కె. క్రాంతి కిరణ్, కె. పవన్ కుమార్, కె. చరణ్ తేజా, టి. ఉదయదీప్.ఈ విజయాన్ని వారు నంద్యాల నగరంలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (స్వయంప్రతిపత్తి) కళాశాలలో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25-26 తేదీలలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు “RIPPLE 2K26 – SAMYAK”లో సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి పాల్గొన్న విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, శాంతిరాం విద్యార్థులు ప్రతిభతో ముందంజ వేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు జాతీయ వేదికపై విజయం సాధించడం గర్వకారణమని తెలిపారు. ఎఐఎంఎల్ విభాగాధిపతి డా. జె. డేవిడ్ సుకీర్తి కుమార్ కూడా విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులతో ముందుకు సాగాలని సూచించారు.విజేతలను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ స్థాయి పోటీలలో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.