logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హిందూపురం టౌన్ ఫిబ్రవరి 27.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు 7వ వార్డు కౌన్సిలర్ నాషీరాభాను మరియు కింగ్ సి షఫీ పర్యవేక్షణలో ముక్కడిపేటలోని

భీంలింగమ్మ వీధి ట్యాంక్ వీధి మధ్య ఉన్న కాలువను మున్సిపల్ సిబ్బంది శుభ్రపరిచారు.ఈ సందర్భంగా కాలువలో పేరుకుపోయిన చెత్త, మట్టి మరియు మురుగునీటిని తొలగించి, వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టారు. స్థానికులు ఈ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులకుప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
కొంతకాలంగా ఈ కాలువలో చెత్త, మురుగు నీరు పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపించడం, దోమల పెరుగుదల వంటి సమస్యలు నెలకొన్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలువ మూసుకుపోతే ఇళ్లలోకి మురుగు నీరు చేరే ప్రమాదం ఉందని,స్థానిక ప్రజల ఆరోగ్య క్షేమాలు దృష్టిలో ఉంచుకొని ఉన్న సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేశారు.
దీంతో మున్సిపల్ సిబ్బంది సహాయంతో కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా శుభ్రపరిచారు. కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన కౌన్సిలర్ నాషీరాభాను ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టిడిపి నాయకులు కింగ్ సి షఫీ మాట్లాడుతూ, 7వ వార్డులో అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతాయని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ శుభ్రత కార్యక్రమంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కౌన్సిలర్ నాషీరాభాను మరియు కింగ్ సి షఫీకి కృతజ్ఞతలు తెలిపారు. ముందు ముందు ప్రజా సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కారం చేసే విధంగా అందుబాటులో ఉంటామని టిడిపి నాయకులు కింగ్ సి షఫీ తెలిపారు.

0
137 views

Comment