logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ గురురాజ విద్యాసంస్థల వార్షికోత్సవానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి ఆహ్వానం.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజ విద్యాసంస్థల 24వ వార్షికోత్సవం మరియు గోస్పాడు మండలం బాబానగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ గురురాజా విద్యాసంస్థల డైరెక్టర్ శావల్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా గురురాజా విద్యాసంస్థల డైరెక్టర్ శావల్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం (మార్చి 1, 2026) ఉదయం 09:30 గంటలకు గోస్పాడు మండలం, బాబానగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరగనున్నాయిని . 24 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 'ప్రవాహ' పేరుతో ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

0
14 views

Comment