logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చుండ్రుగుండా మండల బాల్ మేళ 2.0 ప్రోగ్రాం విజయవంతం * మండల విద్యాశాఖ అధికారి (MEO) సూరయ్య

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఫిబ్రవరి 27: (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి )
**************************

చుండ్రుగుండా మండల బాల్ మేళ 2.0 ప్రోగ్రాం విజయవంతం,

* మండల విద్యాశాఖ అధికారి (MEO) సూరయ్య, ప్రధాన ఉపాధ్యాయులు.

చండ్రుగొండ, ఫిబ్రవరి 27: బాల్ మేళా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు మండలములో జరిగిన మూడు కాంప్లెక్స్ ల పరిధిలో చంద్రుగొండ, రేపల్లెవాడ మరియు పోకులగూడెం బాల్ మేళ 2.0 ప్రోగ్రాం లో మండల విద్యాశాఖ అధికారి సురయ్య మరియు చండ్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి, మరియు రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని .ఈ కార్యక్రమంను ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ సమిష్టిగా కలిసి విజయవంతం చేసినందుకు ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థులకు లైబ్రరీ టె స్టోరీ టెల్లింగ్ సంబంధించిన విభాగంలో ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసి మండలానికి పంపడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క క్లాస్ నుంచి మూడు సబ్జెక్టులో ఎగ్జామ్ రాసి మొదటిగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది . చండ్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి , రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం సూరయ్య బహుమతులు అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మూడు కాంప్లెక్స్ ల పరిధిలోని విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగిందనీ. కాంప్లెక్స్ ల అసిస్టెంట్ సెక్రటరీస్ తేజావత్ శ్రీరాములు ,వాంకు డోత్ రామకృష్ణ మరియు మండలంలోని ఆర్పిలుగా వ్యవహరించిన బానోత్ వీరన్న, భూక్య చందు లాల్, నునావత్ రవి, భూక్య కిరణ్ కుమార్ సెక్రెటరీ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

188
4206 views

Comment