logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మేడివాడ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఉమ్మడి జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు సందర్శన

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మేడివాడ కోఆపరేటివ్ బ్యాంక్‌ను ఉమ్మడి జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు సందర్శించారు. కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గూటాల చిన్న మాట్లాడుతూ, గోల్డ్ లోన్లు మరియు హౌసింగ్ లోన్లు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.చైర్మన్ కోన తాతారావు వెంటనే స్పందించి, స్ట్రాంగ్ రూమ్ నిర్మాణానికి స్థానిక ఇంజనీర్‌తో పరిశీలించారు. 15 నుంచి 20 రోజుల్లో స్ట్రాంగ్ రూమ్ పూర్తి చేసి, గోల్డ్ లోన్లు మరియు 5 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు హౌసింగ్ లోన్లు అందజేస్తామని ప్రకటించారు. ఈ పనులు వెంటనే ప్రారంభించాలని సెంట్రల్ బ్యాంక్ సీఈవో గొర్లి శ్రీనివాసు ని మరియు సిబ్బందిని ఆదేశించారు.బ్యాంకులో డ్రైనేజీ, పెయింటింగ్, బోర్డింగ్ ఏర్పాటు చేసినందుకు అధ్యక్షుడు గూటాల చిన్నని చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నక్క వెంకట్రావు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ, సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది, కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

13
907 views

Comment