logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అమరావతిలో పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం

*అమరావతిలో పియుసి కమిటీ చైర్మన్ శ్రీ కూన* *రవికుమార్ గారి అధ్యక్షతన సమీక్షా* *సమావేశం*

👉ఈరోజు వెలగపూడి లెజిస్లేచర్ సచివాలయంలోని కమిటీ హాల్ నెం.1లో పియుసి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది కమిటీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు మరియు సభ్యుల సమక్షంలో గత ఐదేళ్ల వార్షిక నివేదికలు, ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా నిర్ణయాలు మరియు సంస్థల సాధారణ కార్యకలాపాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది.

👉ఈ సందర్భంగా ముఖ్యంగా Dr. B. R. Ambedkar University, Srikakulam మరియు Girijan Cooperative Corporation పనితీరును కమిటీ సమగ్రంగా పరిశీలించింది. విద్యా రంగ అభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి అంశాలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు.

👉సమావేశానికి సంబంధిత శాఖలైన ఉన్నత విద్యాశాఖ,గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు అవసరమైన రికార్డులు, వివరాలతో హాజరు హాజరయ్యారు.అలాగే ఆడిట్ విభాగానికి చెందిన అధికారులు కూడా సమావేశంలో పాల్గొని నివేదికలపై వివరణ ఇచ్చారు.

👉ప్రభుత్వ రంగ సంస్థల పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, ప్రజా నిధుల వినియోగంపై బాధ్యతాయుత ధోరణి పాటించే దిశగా కమిటీ సమీక్షలు కీలకంగా నిలుస్తాయని కమిటీ పేర్కొంది ఈ సమావేశంలో తీసుకునే సూచనలు, సిఫార్సులు సంబంధిత శాఖల భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా ఉంటాయని కమిటీ తెలిపింది.

👉రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏర్పడిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తుందని చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.

18
622 views

Comment