logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు జీవితంలో స్థిర పడటానికి అనేకమార్గాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి *ఐటీడీఏ పీవో బి రాహుల్,

*తెలంగాణ స్టేట్*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఐటీడీఏ** , ఫిబ్రవరి 27*
(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి రబ్బాని)
********************************
నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు జీవితంలో స్థిర పడటానికి ఉన్న ఊరు దాటి తప్పనిసరిగా బయట ప్రపంచంలో అడుగులు వేయడానికి ఐటీడీఏ వై టి సి లో 60 రోజులపాటు డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్ మరియు డాటా ఎంట్రీ శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతి యువకులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించు కోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ యువతీ యువకులకు సూచించారు.
శుక్రవారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో డాటా ఎంట్రీ, డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతి యువకులకు తన ఛాంబర్ లో శిక్షణ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా యువతీ యువకులకు కొన్ని సూచనలు ఇస్తూ ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి రైతులు కూడా వివిధ పద్ధతులలో వ్యవసాయం చేసుకుంటున్నారని, అందుకు తగ్గట్టు డ్రోన్ శిక్షణ తీసుకున్న యువతీ యువకులు డ్రోన్ ద్వారా వ్యవసాయానికి కలిగే ప్రయోజనాల గురించి రైతులకు తెలియజేయాలని అన్నారు. డ్రోన్ మరియు డాటా ఎంట్రీ శిక్షణ తీసుకున్న యువతీ యువకులకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఆరాధ్య ప్రైవేట్ లిమిటెడ్ భువనగిరి, ఎడిలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు, రైట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదు వారు ఉచిత భోజన వసతితో పాటు నెలకు 15 వేల రూపాయల వేతనముతో ఉద్యోగ అవకాశాలు కల్పించినందున,15 మంది యువతీ యువకులు ఆ సంస్థలలో పనిచేయడానికి ముందుకు వచ్చినదుకు వారిని అభినందిస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎక్కువ శాతం వ్యవసాయానికి సంబంధించిన పంట పొలాలలోనే మీయొక్క పనులు ఉంటున్నందున రైతులతో మమేకమై వారికి నచ్చిన పద్ధతిలో విధులు నిర్వహిస్తే తప్పనిసరిగా మీ భవిష్యత్తును మీరు బాగు చేసుకున్న వారు అవుతారని అన్నారు. భవిష్యత్తులో గిరిజన యువతి యువకులు సొంతంగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని ఉపాధి అవకాశాలు పొందడానికి ఐ టి డి ఏ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏడిఎంహెచ్వో సైదులు, ఏవో సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, డేటా ప్రో కంప్యూటర్ మేనేజర్ గోపీనాథ్, ఐటీ ట్రైనర్ సులోచన, సాప్టిక్ స్కిల్ ట్రైనర్ అరుణ, మొబలైజర్ రాహుల్, సమ్మయ్య మరియు గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
-

197
5750 views

Comment