logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీబీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బిబి పట్నం సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీపట్నంలో క్రీడా ప్రాంగణాన్ని మట్టితో నింపి చదును చేసే పనులు పూజోత్సవంతో ప్రారంభం. "ఎవరో వస్తారు, ఏదో చేస్తారు" అని ఎదురుచూడకుండా పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సమిష్టంగా మౌలిక సదుపాయం కల్పించేందుకు ముందుకు సాగారు.పాఠశాల సిబ్బంది ₹40,000, JCB-ట్రాక్టర్ ఓనర్స్ సంఘ సభ్యులు (దువ్వనబోయిన నాగేంద్ర, గరగా విశ్వేశ్వరరావు, అధికారి తాతారావు, కూర్మారావు, లోవరాజు) ₹40,000, తాడి రమేష్ (గ్రీనరీ) ₹25,000, గొంది సిద్దు ₹20,000, గొడే అప్పన్న ₹10,000 అందించారు. ఎస్ఎంసి చైర్మన్ పోతురాజు సత్తిబాబు మిగిలిన మొత్తాన్ని భరిస్తానని ప్రకటించారు.అయితిరెడ్డి రాజునాయుడు, గొడే నాగేశ్వరరావు, పత్తి రామకృష్ణ, రేవళ్ళ ఈశ్వరరావు, ఘంటసాల భవాని శంకర్, మామిడి వరహాలు, కోట దేవుడు, రేవళ్ళ రాము ప్రతి ఒక్కరు ₹4,000 చొప్పున, A కిషోర్ గుప్తా, పొన్నపువ్వుల రమణ ₹2,000 చొప్పున, తల్లిదండ్రులు-ఎస్ఎంసి సభ్యులు సహకారాలు అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ గరగా విశ్వేశ్వరరావు, ఎస్ఎంసి చైర్మన్ సత్తిబాబు, ప్రధానోపాధ్యాయుడు ఎస్.వి. చంద్రశేఖరరావు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమ్మర్ద్ద సహకారం గ్రామీణ విద్యా అభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది.

5
170 views

Comment