logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇచ్చొడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమిపూజ చేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు*

*
*ఇచ్చొడ పాఠశాల అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది*

*ఎమ్మెల్యే అయిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని*

*ఇచ్చొడ మండల కేంద్రంలో గల ZPSS పాఠశాలలో నూతనంగా సైన్స్ ల్యాబ్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ ఎంపి గోడం నగేష్ గారు మరియు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 21 లక్షలతో నిర్మించబడే సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.*

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ... ఎమ్మెల్యే అయిన ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిని అని అన్నారు. ఈ పాఠశాలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*

1
0 views

Comment