కౌన్సిలర్ నే... కానీ మీ సేవకున్ని...
స్వయంగా మంచినీటిని సరఫరా చేస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్..
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 27/02/2026:
ఈ రోజుల్లో రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన వెంటనే “నేనే రాజు, నేనే మంత్రి” అన్న భావనలోకి వెళ్లే నాయకులు చాలామంది కనిపిస్తుంటారు. కానీ ప్రజల సేవే ముఖ్యమని భావిస్తూ భిన్నంగా నిలుస్తున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్.
పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్‌గా, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన ప్రస్తుతం వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వార్డు ప్రజలకు మంచినీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా ప్రారంభించారు.
అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందేమిటంటే—తానే స్వయంగా ట్యాంకర్ వెంట వెళ్లి, ఇంటింటికి నీటిని సరఫరా చేయడం ప్రజలను అబ్బురపరిచింది. సాధారణంగా కౌన్సిలర్ స్థాయిలో ఉన్నవారు చేసే హంగు, ఆర్భాటం కాకుండా, సేవాభావంతో ప్రజల మధ్యకు వెళ్లడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ మాట్లాడుతూ,
“నేను కౌన్సిలర్ ని... కానీ ముందుగా మీ సేవకున్ని. మా వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
ప్రజల మన్ననలు పొందుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.