అంట్లపాలెంలో 50 మందికి సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు
రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అంట్లపాలెం ఎస్ టి కాలనీలో సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ శిబిరం నిర్వహించారు. డాక్టర్ కె.వి. శ్రావణి మార్గదర్శకత్వంలో 0-40 సంవత్సరాల వయస్సు గల 50 మందికి పరీక్షలు చేశారు. "సికిల్ సెల్ ఎనీమియా అంటే రక్త కణాలు వంకర ఆకారంలో మారి, శరీరంలో నొప్పి, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ. త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు" అని డాక్టర్ శ్రావణి తెలిపారు. ఎస్. గోవిందరావు (ఏ ఎన్ ఎం), పి. కృష్ణ (ఎం పి హెచ్ ఈ ఓ), పి. సరోజిని (ఏ .ఎం.ఎల్ హెచ్పి), కె. సూర్యలక్ష్మి (ఏఎన్ఎం), ఎం. కన్నబాబు (హెల్త్ అసిస్టెంట్), టి లక్ష్మి (ఆశా) సిబ్బంది పాల్గొన్నారు.