logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వృధా పోతున్న తాగునీరు. పట్టించుకోని అధికార యంత్రాంగం

రోలుగుంట మండలం కెనాయుడుపాలెం: నిండుగొండ గ్రామానికి వెళ్లే తాగునీటి పైపులైన్ మరమ్మతులు గురించి అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మంచి నీరు వృధాగా పోతోంది. అడిగర్ల బాబునాయుడు కోళ్లు ఫారం వద్ద కె. నాయుడుపాలెం నుంచి పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే నీరు లీకేజీలతో రోజూ వృథా అవుతున్నట్టు స్థానికులు ఫిర్యాది చేస్తున్నారు.పలువురు గ్రామస్తులు . పైపు మరమ్మతులు చేయమని అర్జీలు పెట్టుకున్న సరి అయిన స్పందన లేదు" అంటూ వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఈ సమస్యకు త్వరగా చర్యలు తీసుకోవాలని గ్రామీణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య కొనసాగితే తాగునీరుకి మరింత ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

6
1121 views

Comment