కుసర్లపూడి గ్రామంలో దేవి పెద్దింటమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభం
అనకాపల్లి జిల్లా కుసర్లపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దేవి పెద్దింటమ్మ తల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం భక్తిమయ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పవిత్ర ఉత్సవాలలో భాగంగా తొలిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆర్చకుల చేత నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక దీక్షలు, పూజలు అర్పించారు.కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు , గ్రామ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు, గొల్లు రమణ, గొల్లు గోవింద, సబ్బవరపు పెద్ది నాయుడు, గొల్లు నారాయణరావు, కుసర్లపూడి కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు