logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాదాల శ్రీనివాసులు మృతి ఏపీడబ్ల్యూజేఎఫ్ కు తీరని లోటు.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల ప్రజాశక్తి సీనియర్ విలేకరి మాదాల శ్రీనివాసులు మృతి ఏపీడబ్ల్యూజేఎఫ్ కు తీరని లోటు అని ప్రజాశక్తి ఎడిషన్ ఇన్చార్జి పి.చంద్రయ్య,ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్ లు పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలో ఏబీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ కే శివ నంద్యాల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏ జగన్మోహన్ ఆధ్వర్యంలో మాదాల శ్రీనివాసులు సంతాప సభను ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.కర్నూలు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులుగా నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా పనిచేసి యూనియన్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రజాశక్తి దినపత్రికలో 1992వ సంవత్సరము నుండి విలేఖరిగా నిబద్ధతతో నిజాయితీతో పని చేశారని తెలిపారు. ఆయన మృతి జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ముల్లా నిజాముద్దీన్, మౌలాలి, నంద్యాల నియోజకవర్గ ట్రెజరర్ మస్తాన్ వలి, నాయకులు సుబ్బరాయుడు, నరసింహ, బనగానపల్లె నియోజకవర్గం ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, ఉపాధ్యక్షులు నాగయ్య, సహాయ కార్యదర్శి నరసింహులు ,పాణ్యం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి సుధాకర్, డోన్ నియోజకవర్గ నాయకులు బేతంచెర్ల మధు, రామం భూపాల్, సుబ్బరాయుడు, ఆత్మకూరు నాయకులు ప్రసాద్ యాదవ్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

0
0 views

Comment