logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో ఆదాయం గణనీయంగా పెరుగుదల

రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో ఆదాయం గణనీయంగా పెరుగుదల

రాజాం: విజయనగరం జిల్లా.

రాజాం శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతర మహోత్సవాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈవో బి.వి. మాధవరావు వెల్లడించారు. ప్రత్యేకాధికారి, నవదుర్గ అమ్మవారి ఆలయం ఈవో శ్యామలరావు పర్యవేక్షణలో గురువారం జాతర ఆదాయం లెక్కింపు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం—

👉హుండీ ఆదాయం గత ఏడాది రూ. 12,85,646 ఉండగా, ఈ ఏడాది రూ. 14,07,330కి పెరిగింది.
👉రూ.100 టిక్కెట్లు గత ఏడాది 3050 అమ్ముడవగా రూ. 3,05,000 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 3945 టిక్కెట్లు అమ్ముడై రూ. 3,94,500 ఆదాయం నమోదైంది.
👉మొక్కుబడి టిక్కెట్లు (గత ఏడాది రూ.10) ద్వారా రూ. 2,66,700 రాగా, ఈ ఏడాది (రూ.20) ద్వారా రూ. 1,75,240 ఆదాయం వచ్చింది.
👉రూ.50 స్పెషల్ దర్శనం గత ఏడాది 7777 టిక్కెట్లు అమ్ముడై రూ. 3,88,850 రాగా, ఈ ఏడాది 9250 టిక్కెట్లు అమ్ముడై రూ. 4,62,600 ఆదాయం వచ్చింది.
👉కానుకలు రూపంలో గత ఏడాది రూ. 60,858 రాగా, ఈ ఏడాది రూ. 1,78,711 ఆదాయం వచ్చింది.
👉అద్దాలు, భరిణిలు విభాగం ద్వారా రూ. 5,000, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 92,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

మొత్తంగా గత ఏడాది రూ. 23,94,054 ఆదాయం నమోదు కాగా, ఈ ఏడాది రూ. 27,15,381 ఆదాయం నమోదై దాదాపు రూ. 4 లక్షల మేర పెరుగుదల కనిపించిందని ఈవో పేర్కొన్నారు.
భక్తుల స్పందన పెరగడం, జాతర ఏర్పాట్లు మెరుగుపడడం వల్లే ఆదాయం పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

30
2103 views

Comment