logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్, ఐఏఎస్ గురువారం సాయంత్రం 06:19 గంటలకు ఐడీఓసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎండి జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను నూతన కలెక్టర్‌కు పరిచయం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకత, ప్రజాహితం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతమైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు .జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాల్లో సమగ్రంగా ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు భద్రాచలం పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది.
జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్‌ను ఇల్లందు క్రాస్ రోడ్‌లో గల సింగరేణి గెస్ట్ హౌస్ వద్ద కొత్తగూడెం ఆర్డీవో మధు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసి కార్యాలయానికి చేరుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

304
9728 views

Comment