సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఫిబ్రవరి 28న నిర్వహించబడును
* పీవో రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** భద్రాచలం ఐ టి డి ఏ** ఫిబ్రవరి 26**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఫిబ్రవరి 28న నిర్వహించబడును
బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి, రాహుల్ మరియు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు సమక్షంలో ఈనెల (ఫిబ్రవరి)28వ తేదీ శనివారం రోజున ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సంత్ సేవాలాల్ కమిటీ సభ్యులు మోహన్ లాల్ మరియు భద్రాచలం తాహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు మరియు ముఖ్యంగా బంజారా సోదరులు గిరిజన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు గిరిజన ఉద్యోగులు, బంజారా జాతి పెద్దలు, యువతీ యువకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.