logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీటీఎఫ్ పిలుపు మేరకు నర్సీపట్నం జోన్ ఉపాధ్యాయులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత తాలూకా కార్యాలయంలో నర్సీపట్నం జోన్‌కు చెందిన 6 మండలాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆర్థికపరమైన, విద్యాపరమైన సమస్యలతో సహా సుమారు 44 అంశాలను ఎత్తి చూపారు. సిపిఎస్ విధానం రద్దు, టెట్ పరీక్ష రద్దు, 12వ పీఆర్‌సి కమిషన్ ఏర్పాటు, 1-7-23 నుంచి 30 శాతం పింఛ్‌మెంట్ చెల్లింపు, 11వ పీఆర్‌సి బకాయిలు ఆమోదం, యాప్స్ భారం తగ్గింపు, ప్రతి ప్రైమరీ స్కూల్‌కు విద్యార్థుల రోలుకు సంబంధం లేకుండా 2వ పోస్ట్ మంజూరు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు మంజూరు వంటి ముఖ్య డిమాండ్లను పేర్కొన్నారు. ఇంకా అనేక తీరని సమస్యలు ఉన్నాయని నాయకులు అన్నారు.ఈ ధర్నాలో నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట మండలాల ఉపాయాధ్యాయులు సుమారు 100 మంది పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం జోన్ ఇంచార్జ్ పడాల అప్పారావు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటపతి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.త్రినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.నూకరాజు, ఎస్.దాసు, ఎం.జయలక్ష్మి, కె.తమ్మునాయుడు, ఆర్‌విఎస్‌ఆర్ శర్మ, ఎల్‌వై పాత్రుడు, సిహెచ్ నర్సియోహమూర్తి, పి.రమణ, కె.అశోక్ సామ్రాట్, ఎన్.శ్రీరామ్మూర్తి, మల్లెలింగం, రాము, లోవరాజు తదితరులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

0
0 views

Comment