తూటిపాల శివారు సర్పానది పక్కన అక్రమ ఇసుక తవ్వకాలు: ఎమ్మార్వో వెంకటరమణ జేసిబి స్వాధీనం
అనకాపల్లి జిల్లా, మాకవరపాలెం మండలం తూటిపాల శివారు సర్పానది పక్కన అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న సమాచారం అందుకున్న స్థానిక తాసిల్దార్, ఎమ్మార్వో వెంకటరమణ త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు.అక్రమంగా ఇసుక తవ్వుతున్న ట్రాక్టర్లు, జేసిబి యంత్రాలను గుర్తించిన ఎమ్మార్వో వెంకటరమణ తమ బృందంతో కలిసి వాటిని వెంటనే స్వాధీనం చేసుకుంది. మాకవరపాలెం మండలంలో ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయి.ఎమ్మార్వో వెంకటరమణ మాట్లాడుతూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని. బాధితులపై తగిన చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.