logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు

పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 26, 2026 – ఆదిలాబాద్

గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన మంత్రి, జిల్లాలోని భీంపూర్, బోరజ్ మండలాల పరిధిలో గల హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

అనంతరం హట్టిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

చనాకా-కోరాట బ్యారేజ్ ద్వారా చేకూరే సాగునీటి ప్రయోజనాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర వివరాలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రికి వివరించారు.

ఈ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పి. సుదర్శన్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ అఖిల్మ మహాజన్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, విద్యుత్ శాఖ ఎస్ ఈ శేషరావ్ రాథోడ్, ఆర్డీఓ స్రవంతి, తహసిల్దార్లు శ్రీనివాస్, రాజేశ్వరి, నలందప్రియ, వివిధ శాఖల అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment